హీరోలపై అభిమానంతో కొత్త చిత్రాలు తెరకెక్కుతున్నాయంటే, ఈ సినిమాకి ఈ టైటిల్ అయితే బావుండు, ఆ టైటిల్ అయితే బావుండు అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐడియాస్ ఇస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆ ఐడియాస్ పనికొస్తుంటాయి. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ విషయంలోనూ ఓ ప్రచారం జరుగుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో తేజు ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి 'దేవుడు వరమందిస్తే..' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టైటిల్‌పై తాజాగా తేజు స్పందించాడు. ఆ టైటిల్ మా సినిమాది కాదు, మా సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం..అని తేజు ట్వీట్ చేశాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సుప్రీమ్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తేజు, తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా, ప్రతీ సినిమా నిరాశపరుస్తోంది.
ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఇంటెలిజెంట్'తో కూడా హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు తేజు. అయితే కరుణాకరన్ సినిమాపై పూర్తి నమ్మకం ఉందంటున్నాడు తేజు. క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కె.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంగతిలా ఉంటే, మరో రెండు సినిమాలను తేజు ఆల్రెడీ లైన్‌లో పెట్టేశాడు.
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తేజు ఓ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకి తేజు కమిట్ అయ్యాడు.
ALSO READ: ప్రముఖ గాయని చిన్మయికి లైంగిక వేధింపులు