ENGLISH

మెగా మేనల్లుడి యాక్షన్‌ కెవ్వు కేక

28 September 2017-18:59 PM

మెగా మేనల్లుడు సూపర్‌ స్పీడు మీదున్నాడు. ఓ పక్క 'జవాన్‌' సినిమా చేస్తుండగానే మరో సినిమాని పట్టాలెక్కించేశాడు. బి.వి.ఎస్‌. రవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జవాన్‌' రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో పక్క మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ చేస్తున్న మూవీ షూటింగ్‌ జోరుగా సాగుతోంది. మాస్‌ మసాలా యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో మెగా డైరెక్టర్‌ వినాయక్‌. సెప్టెంబర్‌ 22న ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసేశారు. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. వినాయక్‌ డైరెక్షన్‌లో యాక్షన్‌ ఘట్టాల్ని భలే ఎంజాయ్‌ చేస్తున్నానంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌. బ్యూటీ లావణ్య త్రిపాఠి, తేజుతో జత కడుతోంది. సి. కళ్యాణ్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆశక్తికరమైన కథా, కథనాలతో సాగే సినిమా ఇది. మెగాస్టార్‌తో 'ఖైదీ' సినిమాని తెరకెక్కించి సక్సెస్‌ అందుకున్నాడు. చరణ్‌తో 'నాయక్‌', అల్లు అర్జున్‌తో 'బన్నీ' సినిమాలు వినాయక్‌ లిస్టులో హిట్‌ సినిమాలు. ఇక ఈ లిస్టులో తేజు కూడా జాయిన్‌ అయ్యాడు. వినాయక్‌ సినిమాలంటే కమర్షియల్‌గా ఎక్కువగా స్కోప్‌ ఉంటుంది. అలాంటి సినిమాల్లో తేజు మేనమామ చిరంజీవిలా భలే మెరిసిపోతాడు. సరైన కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్న తేజుకి ఆ బంపర్‌ ఛాన్స్‌ వినాయక్‌ రూపంలో పర్‌ఫెక్ట్‌ టైంలో దొరికినట్లే. ఈ అవకాశాన్ని తేజు ఎలా యూజ్‌ చేసుకుంటాడో చూడాలిక.

 

ALSO READ: తల్లిగా రెజినా!