ENGLISH

రాయ‌ల‌వారు.. విచ్చేస్తున్నార‌హో..!

06 June 2020-14:00 PM

శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు అంటే నంద‌మూరి హీరోలు గుర్తొస్తారు. ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ రాయ‌ల‌వారుగా అల‌రించారు. ఇటీవ‌ల శ్రీ‌కాంత్ కూడా దేవ‌రాయ‌లో ఆ పాత్ర పోషించాడు. ఇప్పుడు మెగా హీరో కూడా రాయ‌ల‌వారి గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు టాక్‌. ఆ మెగా హీరో ఎవ‌రో కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్‌.

 

సాయిధ‌ర‌మ్ క‌థానాయ‌కుడిగా వీరూ పోట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇది మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అయితే ఓ స‌న్నివేశంలో సాయిధ‌ర‌మ్ తేజ్ శ్రీ‌కృష్ణ దేవ‌రాయులుగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది ఎంత సేపు...? శ్రీ‌కృష్ణ దేవ‌రాయుల‌కీ ఈ సినిమాకీ ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌కి పిరియాడిక‌ల్ ట‌చ్ ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మొత్తానికి వీరూ పోట్ల సాయిధ‌ర‌మ్‌తో ఏదో ప్రయోగ‌మే చేయిస్తున్న‌ట్టున్నాడు.

ALSO READ: జ‌గ‌న్ మీటింగ్‌... బాల‌య్య లేకుండానేనా?