ENGLISH

వ‌రుణ్ హీరోయిన్‌... మ‌హేష్ కోసం?

05 June 2020-14:40 PM

మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కైరా అద్వాణీ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. `భ‌ర‌త్ అనే నేను`లో వీరిద్ద‌రూ జోడీ క‌ట్టారు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. మ‌హేష్ అందానికి, కైరా గ్లామ‌ర్ తోడైంది. అందుకే ఈ జంట‌ని మ‌రోసారి చూపించోతున్నార‌ని చెప్పుకున్నారు.

 

అయితే.. ఇప్పుడు మ‌రో నాయిక పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. సైయి మంజ్రేక‌ర్‌. దబాంగ్ 3లో స‌ల్మాన్‌తో జ‌ట్టు క‌ట్టింది మంజ్రేక‌ర్‌. ఇప్పుడు తెలుగులో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. త‌న‌నే మ‌హేష్ సినిమాకి హీరోయిన్ గా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో కైరా కూడా ఉంటుందా? కైరా స్థానంలోనే మంజ్రేక‌ర్ వ‌చ్చిందా? అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త లేదు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌లైపోయాయ‌ని తెలుస్తోంది.

ALSO READ: సినిమాల‌కు దూరంగా స‌మంత‌