ENGLISH

సినిమాల‌కు దూరంగా స‌మంత‌

05 June 2020-13:10 PM

పెళ్ల‌య్యాక స‌మంత తీరులో చాలా మార్పు వ‌చ్చింది. సినిమాల కోసం ఎగ‌బ‌డడం లేదు. వ‌చ్చిన అవ‌కాశాల్లో ది బెస్ట్ అనుకున్న‌వే ఎంచుకుంటోంది. రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌కు పూర్తిగా చెక్ పెట్టేసింది. అలాంటి క‌థ‌ల్ని ఏమాత్రం ప్రోత్స‌హించ‌డం లేదు. కుటుంబానికి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తోంది. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల సినిమాలు వ‌చ్చినా - నిర్మొహ‌మాటంగా `నో` చెబుతోంది. ప్ర‌స్తుతానికైతే స‌మంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

 

కొత్త‌గా ఒప్పుకున్నవీ లేవు. క‌రోనా ఎఫెక్ట్ తో రెండు నెల‌ల నుంచి ఇంట్లోనే ఉంటోంది స‌మంత‌. మీడియాకు సైతం ఫోన్లో కూడా అందుబాటులో ఉండ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ఫ్యాన్స్ తో ట‌చ్‌లో ఉంటోంది. మ‌రి కొన్నాళ్లు ఇలానే ఇంటి ప‌ట్టునే ఉండాల‌ని స‌మంత నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. 2020 లో స‌మంత మ‌రో సినిమా చేయ‌ద‌ని, త‌న కొత్త సినిమా 2021లోనే మొద‌ల‌వుతుంద‌ని స‌మంత స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. సో ఈ యేడాది స‌మంత‌ని వెండి తెర‌పై చూళ్లేమ‌న్న‌మాట‌.

ALSO READ: Samantha Latest Photoshoot