కేజీఎఫ్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన మూవీ సలార్. KGF సినిమాకి ఏ మాత్రం అంచనాలు తగ్గకుండా ఉంది సలార్ కూడా. సలార్ 1000 కోట్ల క్లబ్ లో చేరటం, స్టార్ కాస్టింగ్ ఉండటంతో ఈ మూవీ డార్లింగ్ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. పాన్ ఇండియా సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. దీనితో ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. వెంటనే సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి, వన్ ఇయర్ లోపు సినిమా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ లోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే సలార్ 2 లేదన్న వార్తలు కూడా వినిపించాయి.
ప్రభాస్ కూడా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడని సలార్ సీక్వెల్ కి చాల టైమ్ పడుతుందని అందుకే సలార్ 2 ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. ఇంతలోనే డార్లింగ్ బర్తడే సందర్భంగా సలార్ 2 రోలింగ్ ప్రారంభించినట్లు అనౌన్స్ చేసారు. సలార్ 2 కి సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని, ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడని ప్రచారం జరిగింది. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అనౌన్స్ మెంట్ లేదు. దీనితో ఫాన్స్ అయోమయానికి గురి అయ్యారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10వ తేదీ నుంచి రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల సలార్2 షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ సినిమా తో నీల్ బిజీ కావటంతో సలార్ 2 ఆగింది. ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ లో సలార్ 2 కోసం వేసిన సెట్ అలాగే ఉందని సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అసలు సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అవలేదని, ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీలతో బిజీగా ఉన్నాడని, కేవలం ఇది పీఆర్ స్టన్ట్ అని తెలుస్తోంది. దీని వెనక ఎవరున్నారన్నది స్పష్టంగా తెలియటం లేదు. సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలోపెట్టుకుని సలార్2 కోసం నిర్మాతలు నీల్ వెంట పడిన సంగతి తెలిసందే కానీ ఈ ప్లాన్ ఎవరిదీ అన్న సంగతి తెలియటం లేదు. ప్రశాంత్ నీల్ ముందే కన్ఫర్మ్ చేసేసారు. ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కిస్తున్నట్టు, దీనికోసం వన్ ఇయర్ టైం కేటాయిస్తు న్నట్లు, తరవాత KGF: చాప్టర్ 3, అని కూడా స్పష్టం చేసారు. సో ఇప్పటిలో సలార్ 2 లేదన్నది వాస్తవం.