ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం సలార్. కేజీఎఫ్ తరవాత.. ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే.. ప్రశాంత్ నీల్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2022లో ఈ చిత్రం విడుదల అవుతోంది. అయితే.. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిపోయింది. అందులో కొన్ని కీలక ఘట్టాలున్నాయి. ప్రస్తుతం ఆయా సన్నివేశాలకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది.
అయితే వీటిలో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ పట్ల... ప్రశాంత్ నీల్ అసంతృప్తిగాఉన్నాడని టాక్. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రశాంత్ నీల్‌కి యాక్షన్ సన్నివేశాలు తీయడంలో మంచి పేరుంది. ఎలివేషన్లు అద్భుతంగా తీస్తాడని.. చెప్పుకుంటారు. కేజీఎఫ్‌లో ఉన్నవన్నీ ఎలివేషన్ సీన్లే. ప్రభాస్ తో సినిమా, పైగా.. భారీ అంచనాలున్నాయి కాబట్టి, ఏ విషయంలోనూ రాజీ పడకూడదని అనుకుంటున్నాడట. అందుకే ఆయా సన్నివేశాల్ని రీషూట్ చేయాలని భావిస్తున్నాడు.
ALSO READ: నాలుగో రోజూ దుమ్ము రేపిన అఖండ