దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి హిందీ లో డైరెక్టర్ గా ‘మెంటల్ హై క్యా’ చిత్రంతో పరిచయం కానున్నాడు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం పైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోపంతో ఉన్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే, ‘మెంటల్‘ అనే టైటిల్ ని సల్మాన్ ఖాన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థల పేరుతో రిజిస్టర్ చేసుకున్నారట, అదే విధంగా తాము నిర్మించబోయే చిత్రాలలో ఏదో ఒక చిత్రానికి ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అయితే ఉన్నట్టుండి నిర్మాత ఏక్తా కపూర్ ఇలా ఈ చిత్రానికి ‘మెంటల్ హై క్యా’ అని టైటిల్ ఫిక్స్ చేయడంతో ఖాన్ కుటుంబం షాక్ కి గురైనట్టు తెల్సింది. తమని అడిగితే తామే ఇచ్చే వాళ్ళము అని అంతే తప్ప ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అని వారు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారాట. ఇక ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ప్రముఖ నటీనటులు రాజ్ కుమార్ రావు & కంగనా రనౌత్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ALSO READ: http://telugu.iqlikmovies.com/viewnews/sridevi-condolence-meet-in-chennai/5560