ENGLISH

సంచలన వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్

27 September 2017-17:42 PM

సల్మాన్ ఖాన్ అంటేనే సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్. అటువంటి ఆయన ఈ మధ్యనే ఒక టీవీ ఛానల్ పైన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

 

వివరాల్లోకి వెళితే, బిగ్ బోస్ షోకి క్రేజ్ రావడానికి కారణం తను హోస్ట్ గా ఉండడమే అని అందుకే సదరు ఛానల్ వారు గత పది సీజన్ల నుండి తనని మార్చలేదు అని చెప్పాడు. ఇక ఇంకొక అడుగుముందుకు వేసి తన హోస్టింగ్ ఉన్న షో లేకపోతే ఆ ఛానల్ కి TRPలు రావని చెప్పేయడంతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇదిలావుండగా అక్టోబర్ 1వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 11 మొదలవ్వనుంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తవ్వగా సోమవారం నుండి ఈ షో ప్రేక్షకులని కనువిందు చేయనుంది.

 

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్