ENGLISH

ప్రబాస్‌కి అతడైతేనే కరెక్ట్‌

13 June 2017-15:21 PM

టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ ఇప్పుడు 'బాహుబలి'గా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అయితే ఈ ఇద్దరికీ లింకేంటంటారా? ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది ఓ సారి ఊహించండి. ఊహ కాదు, ఇది నిజం కానుంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి ఈ ఇద్దరు హీరోల్ని పెట్టి ఓ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. కమర్షియల్‌ సినిమాలకు రోహిత్‌ శెట్టి పెట్టింది పేరు. అందులోనూ సుల్తాన్‌ సల్మాన్‌, బాహుబలి ప్రబాస్‌ ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఊహకందడం లేదు. 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌ బాలీవుడ్‌ హీరో అయిపోయాడు. అక్కడ బోలెడంత క్రేజ్‌ సంపాదించేసుకున్నాడు ప్రబాస్‌. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నాడు రోహిత్‌ శెట్టి. సల్మాన్‌ ఖాన్‌ టాలీవుడ్‌లో చిరంజీవి 150వ సినిమా అయిన 'ఖైదీ నెంబర్‌ 150'లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు ప్రబాస్‌ ద్వారా అది సాధ్యమయ్యేటట్లే ఉంది. ఈ సినిమాని ద్విభాషా చిత్రంగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్‌ క్లారిటీ రానుంది. మరో పక్క ప్రబాస్‌ ప్రస్తుతం 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నాడు. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ట్యూబ్‌లైట్‌' ఈ రంజాన్‌కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: తారక్ అధికారికంగా చెప్పేశాడు