ENGLISH

సల్మాన్‌ఖాన్‌ చంకెక్కేసిన షారూఖ్‌ ఖాన్‌

14 June 2018-17:44 PM

షారూఖ్‌ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం జీరో'. ఇదో ప్రయోగాత్మక చిత్రం. షారూఖ్‌ ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్రలో గతంలో చాలా మంది స్టార్‌ హీరోలు నటించారు. కమల్‌హాసన్‌ మరుగుజ్జు పాత్రలో కనిపించిన 'విచిత్ర సోదరులు' అప్పట్లో ఓ సంచలనం. మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రలో షారూఖ్‌ ఖాన్‌ నటించి, మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానున్నాడు. 

'జీరో' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. రంజాన్‌ సందర్భంగా ఈ టీజర్‌ని సల్మాన్‌ఖాన్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో షారూఖ్‌ఖాన్‌తో పాటు, సల్మాన్‌ఖాన్‌ కూడా కనిపించాడు. అంటే ఈ సినిమాలో సల్మాన్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనీ టీజర్‌ క్లిప్పింగ్‌ ద్వారా భావించాలి. ఇద్దరూ కలిసి ఫుల్‌ జోష్‌తో ఓ పాటకి డాన్సు చేశారు. టీజర్‌ చివరిలో షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ చంకెక్కేశాడు. మరుగుజ్జు పాత్రలో షారూఖ్‌ ఖాన్‌ చాలా చాలా బాగున్నాడు. అంతేకాదు, ఎప్పటిలాగే జోష్‌గా ఫుల్‌ జోష్‌గా కనిపిస్తున్నాడు. సినిమా డిశంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇకపోతే షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ కలిసి గతంలో పలు చిత్రాల్లో నటించాడు. 'కరణ్‌ అర్జున్‌' అప్పట్లో వీరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుంది. తాజాగా ఈద్‌ సందర్భంగా షారూఖ్‌ఖాన్‌ 'జీరో' టీజర్‌ని సల్మాన్‌ఖాన్‌ విడుదల చేయగా, ఈద్‌కి ఎప్పటిలాగే సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న 'రేస్‌ 3' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: నా నువ్వే రివ్యూ & రేటింగ్