ENGLISH

బాలీవుడ్‌ కండల వీరుడు తండ్రి కాబోతున్నాడూ!

26 September 2017-17:47 PM

బాలీవుడ్‌ కండలవీరుడు అంటే సల్మాన్‌ ఖాన్‌. సల్మాన్‌ఖాన్‌ ఏంటి తండ్రి కావడం ఏంటనుకుంటున్నారా? నిజమే. ఆయనకి పెళ్లి కాలేదు. అలా అని తండ్రి కాకూడదనే రూలేం లేదుగా ఇప్పుడు. ఎందుకంటే సరోగసీ ఉండగా, పిల్లలెందుకుండరు అండగా.. పెళ్లి కాకుండగా.. బాలీవుడ్‌లో ఈ సరోగసీ (అద్దె గర్భం) విధానంపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇందులో మజా ఏముందో తెలీదు కానీ, బాలీవుడ్‌ బాద్‌షాకి పెళ్లయ్యి, ఇద్దరు బిడ్డలకు తండ్రి కాగా, సరోగసీ విధానంపై మరో బిడ్డకి తండ్రయ్యాడు. అలా పుట్టిన బిడ్డ పేరు అబ్రామ్‌ ఖాన్‌. అమీర్‌ఖాన్‌ కూడా అంతే. సరోగసీ విధానంలోనే తండ్రయ్యాడు. ఇటీవలే ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా సరోగసీ పద్ధతిలోనే తండ్రయ్యాడు. ఇప్పుడు సల్లూభాయ్‌ వంతు. సల్లూభాయ్‌ కూడా సరోగసీ ద్వారా తండ్రి కావాలనే యోచనలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం సల్లూ భాయ్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే రెండేళ్ల తర్వాత ఈ విధానంలో తండ్రి కావాలని అనుకుంటున్నాడట. ఎన్నో లవ్‌ ఫెయిల్యూర్స్‌. ఆయన్ని పెళ్లి పీటల దాకా వెళ్లనీయకుండా చేశాయి. కానీ మంచి భర్త కాకపోతేనేమీ, మంచి తండ్రిగా తాను సరిపోతాననీ, ఓ తండ్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయనీ సల్మాన్‌ఖాన్‌ గతంలో అన్నారు. అందుకే ఆయన సరోగసీని ఎంచుకున్నారనీ సమాచారమ్‌. మరో రెండేళ్లలో సల్మాన్‌ తండ్రి కాబోతున్నాడట.

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..