ENGLISH

శామ్‌, చైతూ - నిను విడిచి నేనుండలేక!

16 June 2017-12:15 PM

'నేను అనారోగ్యానికి గురైతే - నా విమానం టేకాఫ్‌ కాకుంటే - వర్షం పడి ఆగిపోతే - ప్లీజ్‌ నన్ను వెళ్ళనివ్వొద్దు' అని సమంత, చైతూని ఉద్దేశించి, ప్రకృతికి విజ్ఞప్తి చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దానికి ఓ ఫొటోని జత చేసింది. ఫొటోలో సమంతని నాగచైతన్య ఒడిసి పట్టుకున్నాడు. ఇద్దరూ తన్మయత్వంలో ఉన్నారు. ఇలాంటి హాట్‌ పోస్ట్‌లు సమంత ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది. ఈ రకంగా తమ ప్రేమానుభవాలను ఎప్పటికప్పుడే ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అందుకే సమంత పోస్ట్‌ల విషయంలో సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తాజా పోస్ట్‌ చూసి కూడా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అహా సమంతకి, చైతూ అంటే ఎంత లవ్వో కదా అనుకోకుండా ఉండలేకపోతున్నారు. త్వరలో ఈ ప్రేమ జంట వైవాహిక బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసినదే కదా. ఓ తమిళ సినిమా షూటింగ్‌ కోసం తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్ళాల్సి ఉంది సమంత. కానీ నాగచైతన్యను విడిచి అంత దూరం వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు. అయ్యయ్యో సమంతకి ఎంత కష్టమొచ్చింది? ఈ మాత్రందానికే ఇంత బాధపడాలా? తనతోపాటు సమంత, నాగచైతన్యని వెంటేసుకెళ్ళిపోవచ్చు కదా! మరో పక్క సమంత, చరణ్‌తో సుకుమార్‌ డైరెక్షన్‌లో రాబోతున్న 'రంగస్థలం' సినిమాలో నటిస్తోంది. చైతూ కూడా రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

ALSO READ: మహేష్-వంశీ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?