ENGLISH

బంగారం అమ్ముతానంటున్న స‌మంత‌

21 June 2021-12:00 PM

వ్యాపార రంగంలో సినీ తార‌ల హ‌వా ఇప్ప‌టిది కాదు. సినిమాల్లో బాగా సంపాదించిన వాళ్లు, వ్యాపారంలో అడుగుపెట్టి, పెట్టుబ‌డి పెట్టి, బాగా సంపాదించ‌డం చాలా స‌హ‌జం. మ‌న బ‌డా హీరోలంద‌రికీ... వ్యాపార రంగంలో మంచి అనుభ‌వం వుంది. హీరోయిన్లూ అదే బాట ప‌డుతున్నారు. ఇప్పుడు స‌మంత కూడా బిజినెస్ వుమెన్ గానూ బిజీ. త‌నకు ఓ స్కూల్ ఉంది. దుస్తుల వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. త్వ‌ర‌లోనే జ్యూయ‌ల‌రీ బిజినెస్ చేయ‌బోతోంద‌ట‌. అందుకోసం ఇప్పుడే... ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంద‌ని స‌మాచారం.

 

మ‌గువులు మెచ్చే బంగారు, వ‌జ్ర ఆభ‌ర‌ణాల‌ను.. త‌యారు చేయించి, వాటిని ఆన్ లైన్ ద్వారా అమ్మాల‌ని చూస్తోంది స‌మంత‌. ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెద్ద పెద్ద మాల్స్ అద్దెకు తీసుకుని, అందులో త‌న బిజినెస్ మొద‌లెట్ట‌బోతోంద‌ట‌. జ్యూయ‌ల‌రీ వ్యాపారానికి ఓ అంద‌మైన పేరు కూడా ఎంచుకుంద‌ని తెలుస్తోంది. ఓ వైపు స‌మంత‌... సినిమాల‌తో బిజీగా ఉంటోంది. మరోవైపు.. ఇలా వ్యాపారం గురించీ ఆలోచిస్తోంది. ఎంతైనా.. త‌ను మ‌ల్టీటాస్క్ ప‌ర్స‌నాలిటీనే.

ALSO READ: స‌లార్ కి వంద కోట్ల డీల్.. అమేజాన్ సూప‌ర్ ఆఫ‌ర్‌