ENGLISH

Samantha: సమంత వెనక్కి తగ్గింది కానీ

08 October 2022-16:19 PM

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేసిన సామ్‌.. ఆ పోస్ట్‌కి ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అని క్యాప్షన్‌ రాసింది. సమంత గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అంతగా కనిపించడం లేదు. తరచూ పర్సనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చే సామ్‌.. ఇటివల కాలంలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. కేవలం సినిమాల అప్‌డేట్స్ మాత్రమే షేర్‌ చేస్తున్నారు.

 

సమంత చాలా అంశాలపై మాట్లాడుతుంటుంది. అందులో తన వ్యక్తిగత అంశాలు కూడా వుంటాయి. కానీ కొన్నాళ్ళుగా ఆమె సైలెంట్ గా వుంటుంది. దీంతో సామ్‌ కెరీర్‌పై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సామ్‌ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక, సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి.

ALSO READ: ధ‌నుష్ షాకింగ్ నిర్ణ‌యం.. విడాకులు వెన‌క్కి!