ENGLISH

Srinu Vaitla: శ్రీనువైట్ల.. హిట్టు కొట్టాల్సిందే

08 October 2022-15:17 PM

శ్రీను వైట్ల వంద రోజుల సినిమాలు తీసిన దర్శకుడు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్, ‘ఢీ’, ‘రెడీ’, కింగ్ లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్లు అందించిన దర్శకుడు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆయన ఖాతాలో సినిమాలే తగ్గిపోయాయి. చాలా నమ్మకాలు పెట్టుకున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ కూడా దారుణంగా దెబ్బకొట్టింది. దిని తర్వాత ఆయన నుండి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఆ మధ్య మంచు విష్ణుతో ‘ఢీ’ సీక్వెల్‌ చేయనున్నట్లు ప్రకటించినా.. అదీ కార్యరూపంలోకి రాలేదు.

 

అయితే ఎట్టకేలకు శ్రీను వైట్ల నుంచి కొత్త కబురు అందింది. ఆయన త్వరలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తన మిత్రుడు రచయిత గోపీమోహన్‌ ఈ చిత్రానికి కథ అందించనున్నట్లు తెలిపారు. శ్రీనువైట్లకి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఒక విజయం కావాలి. ఆ విజయం గోపిచంద్ తోనే రావాలని కోరుకుందాం.

ALSO READ: ధ‌నుష్ షాకింగ్ నిర్ణ‌యం.. విడాకులు వెన‌క్కి!