ENGLISH

సమంత ఈసారి భ‌య‌పెట్ట‌నుందా?

14 October 2020-12:00 PM

హార‌ర్ సినిమాల‌కు కాలం చెల్లిపోయిన‌ట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఈమ‌ధ్య వ‌చ్చిన హార‌ర్ సినిమాలేవీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఒక ద‌శ‌లో... విరివిగా వ‌చ్చిన హార‌ర్ చిత్రాలు ఇప్పుడు త‌గ్గుమొహం ప‌ట్ట‌డానికి కార‌ణం అదే. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్లు సైతం న‌టించ‌డానికి ఉత్సాహ‌ప‌డేవారు. ఇప్పుడు వాళ్లెవ‌రూ ఈ క‌థ‌ల జోలికి వెళ్ల‌డం లేదు. అయితే విచిత్రంగా స‌మంత ఇప్పుడు ఓ హార‌ర్ క‌థ‌ని ఎంచుకుంది. స‌మంత క‌థానాయిక‌గా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించ‌నుంది. దీనికి నందినిరెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తారు.

 

స‌మంత - నందిని కాంబినేష‌న్‌లో ఓ బేబీ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆసినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ కాంబోలో మ‌రో సినిమా రాబోతోంది. అయితే ఈసారి హార‌ర్ క‌థ‌ని ఎంచుకున్నారు. నిజానికి త‌మిళ ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ్ తో స‌మంత ఈసినిమా చేయాలి. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల అశ్విన్ ఈసినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని, దాంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నందినికి అప్ప‌గించార‌ని తెలుస్తోంది. న‌వంబ‌రులో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ALSO READ: ఆ 20 నిమిషాలు ఎప్ప‌టికీ గుర్తుంటాయి: త్రివిక్ర‌మ్