ENGLISH

సంపత్ నంది సినిమా...పేపర్ బోయ్‌

08 June 2017-12:55 PM

ఏమైంది ఈ వేళ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు సంప‌త్ నంది. నిర్మాత‌గానూ త‌న తొలి సినిమా అదే. గాలిప‌టం సినిమాకీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు సంప‌త్‌. ఇప్పుడు త‌న నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే పేప‌ర్ బోయ్‌.  జ‌య శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తారు. ఐశ్వ‌ర్య వాట్క‌ర్ హీరోయిన్‌. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభమైంది.  హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి గోపీచంద్ క్లాప్ కొట్టగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కేతరీన్ గౌరవ దర్శకత్వం వహించింది.

ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. "హిలేరియస్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న "పేపర్ బోయ్" ప్రారంభోత్సవానికి నా సన్నిహితులందరూ విచ్చేసి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. నా "బెంగాల్ టైగర్"తోపాటు "బిల్లా, మాట్రన్" వంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ వర్క్ తో మంచి వేల్యూ తీసుకువచ్చిన ఎస్.సౌందర్ రాజన్ "పేపర్ బోయ్"కి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండడం విశేషం. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించనుండడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

ALSO READ: బ‌న్నీ మాస్ట‌ర్ ప్లాన్ తో రూ.5 కోట్లు లాభం