ENGLISH

పబ్లిక్‌లో ‘స్పోర్ట్స్‌ బ్రా’ ప్రదర్శనతో హీరోయిన్

05 September 2020-15:00 PM

సోషల్‌ మీడియా వేదికగా హీరోయిన్లు ‘లో దుస్తుల’ ప్రదర్శన చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఓ హీరోయిన్‌ పబ్లిక్‌లో ‘లో దుస్తుల ప్రదర్శన’ చేస్తూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసిందని నెటిజన్లు గుస్సా అవుతున్నారు. ఆ హీరోయిన్‌ ఇంకెవరో కాదు, నిఖిల్‌ హీరోగా నటించిన ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమాలో కన్పించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్దే. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడంలో ఈ బ్యూటీ దిట్ట. పైగా, ఈ బ్యూటీ మల్టీ టాలెంటెడ్‌ కూడా. ఫ్రీ స్టయిల్‌ డాన్సింగ్‌లో పేరు ప్రఖ్యాతులు గడించింది.

 

తాజాగా ఓ పబ్లిక్‌ పార్క్‌లో వ్యాయామం కోసం వెళ్ళిన సంయుక్త హెగ్దే, పైన వేసుకున్న కోట్‌ తీసేసి, స్పోర్ట్స్‌ బ్రాతో పబ్లిక్‌ షో చేసిందట. దానిపై కొందరు ఆ పార్క్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇది పబ్లిక్‌ న్యూసెన్స్‌.. అని నెటిజన్లు అంటోంటే, ‘కావాలనే కొందరు తమపై దాడి చేశారు..’ అంటోంది సంయుక్త హెగ్దే. ‘అదేమీ అంగాంగ ప్రదర్శన కాదు. అది వ్యాయామం కోసం ఉద్దేశించిన ఔట్‌ ఫిట్‌..’ అని తేల్చేసింది సంయుక్త. కానీ, మేటర్‌ ఇంకోలా కన్వే అవుతోంది చాలామందికి. ఉద్దేశ్యం ఏదైనా, ఇది ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌’లానే కన్పిస్తోందన్నది మెజార్టీ వాదన.

 

అయితే, సంయుక్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అదే సమయంలో సంయుక్తపైన కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. సినిమాల సంగతెలా వున్నా, ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లతో పేరు సంపాదించుకోవడం కూడా ఓ ఎత్తుగడేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Samyuktha Hegde Latest Photoshoot