ENGLISH

అయ్యయ్యో 'సంఘమిత్ర'

05 June 2017-17:15 PM

భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కాల్సిన 'సంఘమిత్ర' సినిమా ముద్దుగుమ్మ శృతిహాసన్‌ ప్రధాన పాత్రలో రూపొందాల్సి ఉంది. కేన్స్‌ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేన్స్‌లో సందడి చేసింది ముద్దుగుమ్మ శృతిహాసన్‌. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఆ సినిమా నుండి శృతిహాసన్‌ తప్పుకుంటున్నానంటూ అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. దాంతో సినిమా డైలమాలో పడింది. శృతిహాసన్‌ ప్లేస్‌లోకి ఎవరొస్తారో తెలియడంలేదు. పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నా ఎవరూ నచ్చడంలేదట ప్రముఖ దర్శకుడు సుందర్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. శృతిహాసన్‌ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ఇద్దరూ హీరోలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని సమాచారమ్‌. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగినప్పుడు, ఈ సినిమా గొప్పతనాన్ని 'బాలీవుడ్‌'తో పోల్చి చెప్పారు, ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది శృతిహాసన్‌. ఈ సినిమా శృతి కెరీర్‌లో ఓ మైలు రాయి కానుందని అనుకున్నారంతా. త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లాల్సిన ఈ సినిమా విషయంలో అనూహ్యంగా శృతి ప్రవర్తనతో చిక్కుల్లో పడింది. ఇప్పుడీ ప్రాజెక్టు ఎప్పటికి పట్టాలెక్కుతుందో తెలియని సందిగ్ధంలో ఉంది. ఇంకా నటీనటుల విషయంలోనే క్లారిటీ రావడంలేదు.

ALSO READ: 'బాహుబలి'ని దాటేస్తా: 'ట్యూబ్‌లైట్‌' సల్మాన్‌