ENGLISH

శృతిహాసన్‌పై 'సంఘమిత్ర' టీమ్‌ ఫైర్‌

31 May 2017-18:37 PM

ముద్దుగుమ్మ శృతిహాసన్‌ 'సంఘమిత్ర' సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన వార్త ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ఇదో భారీ బడ్జెట్‌ సినిమా. 200 కోట్లు బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్నీ ఆలోచించే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకి శృతిహాసన్‌ని హీరోయిన్‌గా ఎంచుకుంది. అరదుకే శృతిహాసన్‌ ఈ సినిమా కోసం ఆల్రెడీ కసరత్తులు కూడా మొదలెట్టేసింది. విదేశాలకు వెళ్లి కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకుంది. అయితే సడెన్‌గా ఎందుకు ఈ సినిమా నుండి శృతిహాసన్‌ తప్పుకుంది అంటే.. సినిమాకి కథ ఇంకా ఫైనల్‌ కాలేదు. కథనం విషయంలో క్లారిటీ లేదు అని ఆరోపణలు చేసింది శృతి. ఈ ఆరోపణలపై చిత్ర యూనిట్‌ ఘాటుగా స్పందించింది. ప్రముఖ తమిళ డైరెక్టర్‌ సుందర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టేకప్‌ చేసిన ప్రాజెక్ట్‌ ఇది. ఈ సినిమాకి కథ రెడీ కాకపోవడం అంటే హాస్యాస్పదం.. అసలు శృతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలీడం లేదు అని వాపోయింది. మొత్తానికి వివాదాల్లోకెక్కిన ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కవలసింది కాస్త, ఇప్పుడు హీరోయిన్‌ వేటలో పడి మరి కొంత ఆలస్యం కానుంది. లేటెస్టుగా జరిగిన కేన్స్‌ చిత్రోత్సవంలో ఈ సినిమాని ఘనంగా లాంఛ్‌ చేశారు. ఇంతలోనే ఈ సినిమా వివాదాల్లోకెక్కడం ఆశ్చర్యకరం. ఇంతకీ పొరపాటు ఎవరిదనేది అర్ధం కావడం లేదు కానీ, మొత్తానికి ఈ సినిమా నుండి శృతి ఎందుకు తప్పుకుంది అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. 

 

ALSO READ: దాసరి మృతికి సంతాపంగా సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న నిర్ణయం!