ENGLISH

అఖండ 2 లో సంజయ్ దత్ ?

19 February 2025-12:36 PM

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటాయి. వాళ్ళు ఎన్ని సార్లు వచ్చినా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుంది. అలాంటి కాంబోలో బాలయ్య - బోయపాటి ద్వయం ఒకటి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బోయపాటి ఎవరితో సినిమా తీసినా ఇంత భారీ హిట్ అందుకోలేకపోతున్నాడు. బాలయ్యకి మళ్ళీ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ బాలయ్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే మళ్ళీ బాలయ్యతోనే వరుస సీక్వెల్స్ తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

బాల‌కృష్ణ కెరీర్‌ లో అఖండ ది బెస్ట్ గా నిలిచింది. బాలయ్య కెరియర్ టర్నింగ్ పాయింట్ కూడా ఈ మూవీనే. అఖండ మూవీ తరవాత బాలయ్య వరుస హిట్స్ అందుకున్నారు. బోయ‌పాటి కి కూడా ఆ తరవాత సరైన హిట్ లేదు. మళ్ళీ అఖండ 2తో క‌మ్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొదటి సినిమాలో కనిపించే పాత్రలన్నీపార్ట్ 2 లో కూడా రిపీట్ అవుతున్నాయి. అదనంగా ఇంకొన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. హీరోయిన్ సంయుక్త మీన‌న్, ఆది పినిశెట్టి అఖండ 2 లో నటిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్  స్టార్ సంజ‌య్ ద‌త్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. సంజయ్ ఈ మధ్య సౌత్ లో విలన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఇప్పటికే 'డబుల్ ఇస్మార్ట్' లో సంజ‌య్‌ద‌త్ విల‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు బోయపాటి మూవీలో ఆఫర్ వచ్చింది. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. హీరోకి ధీటుగా విలన్ పాత్ర డిజైన్ చేస్తారు బోయపాటి. సంజయ్ లో ఉన్న నటుడ్ని బోయపాటి కరక్ట్ గా ఎలివేట్ చేస్తూ హైలెట్ చేస్తాడు. పైగా బాల‌య్య విలన్ గా సంజ‌య్ ద‌త్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అఖండ మూవీ కేవలం తెలుగులో రిలీజ్ అయ్యింది. కానీ అఖండ 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రానుంది. సంజయ్ దత్ రాక హిందీ మార్కెట్ ని పెంచుతుంది.

ALSO READ: ఖైదీ 2 లో సూర్య, కమల్ కూడా ఉన్నారా ?