ENGLISH

ఖైదీ 2 లో సూర్య, కమల్ కూడా ఉన్నారా ?

19 February 2025-12:30 PM

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమా యూనివర్స్ లో ఖైదీ మూవీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఖైదీ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం రజినీ కాంత్ తో కూలి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరవాత ఖైదీ 2 తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. 'ఖైదీ' లో కార్తీ నటన వేరే లెవెల్ అని చెప్పాలి. మరొకసారి కార్తీ నటవిశ్వరూపం చూసేందుకు ఫాన్స్ రెడీ అయిపోండి. ఫైనల్ గా ఖైదీ 2 తెరకెక్కుతోంది. లోకేష్ సినిమాలన్నీ మల్టీస్టారర్ లే కావటం గమనార్హం. విక్రమ్ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. కూలి సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున ఉన్నారు.

ఇప్పడు లోకేష్ తెరకెక్కించే ఖైదీ సీక్వెల్ లో కూడా నలుగురు స్టార్ హీరోలు నటిస్తున్నట్టు సమాచారం. ఖైదీ2 లో కార్తీతో పాటు కమల్ ఎంట్రీ ఉంటుంది అని టాక్. ఈ మూవీలో కమల్ పాత్ర విక్రమ్ 2 కి కొనసాగింపు అని తెలుస్తోంది. అలాగే విక్రమ్ మూవీలో ఉన్న ఫాహద్ ఫాజిల్, క్లైమాక్స్ లో వచ్చే రోలెక్స్ పాత్ర కూడా ఖైదీ2 లో కనిపిస్తుంది అని సమాచారం. ఖైదీ 2 లో కమల్ పాత్రని పరిచయం చేస్తూ ఇంకో కోలీవుడ్ హీరో దళపతి విజయ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట.

దీంతో ఇప్పటినుంచే ఖైదీ 2 పై భారీ అంచనాలు పెరిగాయి. లోకేష్ సినిమా యూనివర్స్ లో భాగంగా ఒకే సినిమాలో నలుగురు స్టార్ హీరోలు, ఇంకో హీరో వాయిస్ తమిళ తంబీలకు ఒకే టికెట్ పై నాలుగు సినిమాలు చూసినట్లే.

ALSO READ: అక్కినేని కోడలి షాకింగ్ డెసిషన్