ENGLISH

సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ & రేటింగ్

14 January 2025-13:02 PM

చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
దర్శకత్వం: అనిల్ రావి పూడి
కథ - రచన: అనిల్ రావి పూడి

నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయే,సాయి కుమార్, నరేష్, వీటీవీ గణేష్, పృథ్విరాజ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు.

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్

సంగీతం: భీమ్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు

బ్యానర్:  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

విడుదల తేదీ: 14 జనవరి 2025

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

ఈ మధ్య సరైన హిట్ లేక వెంకటేష్ సతమవుతున్నాడు. ఈక్రమంలో తనకి కలిసివచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడిని మళ్ళీ నమ్ముకుని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పండగ బరిలో దిగుతున్నాడు. అసలు సిసలైన సంక్రాంతి సినిమా అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడి. ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే అచ్చం అలానే ఉంది ఈ మూవీ. ఓటమి ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరెక్కించటంతో ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఆడియన్స్ ని కామెడీతో ఎంగేజ్ చేయటంలో అనిల్ సిద్ద హస్తుడు. సీనియర్ దర్శకుడు జంధ్యాల లాంటి వాడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాల్ని వమ్ము చేయకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు అనిల్ రావి పూడి. వెంకటేష్ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలిగి పోయే క్యారక్టర్ లో అద్భుతంగా నటించాడు. సంక్రాంతి కి వస్తున్నాం మూవీ వినోదాలు పంచి ప్రేక్షకుడిని అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

భార్య భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్), నలుగురు పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు యాదగిరి దామోదర రాజు (వెంకటేష్). రాజు ఒక మాజీ పోలీస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 150కి పైగా ఎన్కౌంటర్లు చేసిన ట్రాక్ రికార్డ్ ఉంటుంది యాదగిరికి. కానీ కొన్ని కారణాల వలన పోలీస్ జాబ్ వదిలి అత్తారింట్లో ఉంటాడు. ఈ క్రమంలో ఒకరోజు యాదగిరిని వెతుక్కుంటూ మాజీ ప్రేయసి, పోలీస్ ఆఫీసర్ మీనాక్షి (మీనాక్షి చౌదరి) వస్తుంది. అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ ( అవసరాల శ్రీనివాస్) హైదారాబాద్ వస్తాడు. సత్య ని సీఎం కేశవ్(నరేష్), పార్టీ ప్రెసిడెంట్(వీటీవీ గణేష్) మర్యాద పూర్వకంగా కలుస్తారు. సీఎం వద్దన్నా వినకుండా పార్టీ ప్రెసిడెంట్ సత్యకి పార్టీ ఇస్తానని ఫామ్ హౌస్ కి తీసుకు వెళ్తాడు. ఫామ్ హౌస్ కి వెళ్లిన సత్యని  ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. జైల్లో ఉన్న తమ అన్నని తప్పించేందుకే వారు ఈ కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయిన  సత్యని విడిపించడానికి ఐపీఎస్ ఆఫీసర్ మీనాక్షి రంగంలోకి దిగుతుంది. ఇందుకోసం తన మాజీ ప్రియుడు యాదగిరి హెల్ప్ కోరుతుంది. ఆ మీనాక్షి తన భర్త మాజీ ప్రేయసి అని తెలిసి భాగ్యం కూడా వారి వెంట వస్తానని బయలుదేరుతుంది. ఇలా యాదగిరి ఒక వైపు ప్రేయసి, మరొక వైపు భార్య తో కలిసి కిడ్నాప్ కేసు సాల్వ్ చెయటానికి బయలుదేరుతాడు. ఈ ముగ్గురు కలిసి ఈ అపరేషన్ సక్సెస్ చేసారా? సత్యని విడిపించారా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులేంటి? ఈ ఇద్దరి భామల మధ్య యాదగిరి ఎలా నలిగిపోయాడు? యాదగిరి అసలు పోలీస్ జాబ్ ఎందుకు వదిలేశాడు? యాదగిరికి మీనాక్షితో ఎందుకు బ్రేకప్ అయ్యింది?  చివరికి ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

అనిల్ రావిపూడి సినిమా అనగానే ముఖ్యంగా కామెడీ ఆశించి వెళ్తారు ప్రేక్షకులు. వారిని డిసప్పాయింట్ చేయకుండా అనిల్ కూడా కథపై కాకుండా కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడు. ట్విస్ట్ లు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, హీరో ఎలివేషన్స్ ఏమీ లేకుండానే సినిమా తీయగల నేర్పరి అనిల్. అన్ని బాధలు మరిచి కాసేపు సినిమాని ఎంజాయ్ చేసేవారికి అనిల్ సినిమాలు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అనిల్ - వెంకీ కాంబో హ్యాట్రిక్ కొట్టారు. ఇది వరకే F2 , F3 తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన వీరు ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం'తో కూడా మరోసారి ఆకట్టుకున్నారు. ఈ మూవీ టైటిల్ తోనే అచ్చమైన సంక్రాంతి సినిమా అనిపించుకుంది. పాటలు ట్రైలర్ తో ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించుకుంది. వెంకటేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు అలరించే పాటలు కూడా ఉన్నాయి. భార్య, ప్రేయసి మధ్య సెటైరికల్ ఫన్నీగా, అలరించేటట్లు ఉన్నాయి.

పెళ్ళై పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉన్న మగాడి లైఫ్ లోకి మళ్ళీ మాజీ ప్రేయసి వస్తే ఆ భర్త పరిస్థితి, భార్య మానసిక సంఘర్షణ, భార్య జెలసీ ఫీలింగ్స్ అన్ని సున్నితంగా చెప్పారు అనీల్. భార్యా భర్తల కథకి కిడ్నాప్ డ్రామాను కూడా యాడ్  చేసి, ఆసక్తి పెంచారు దర్శకుడు. కాకపొతే  కిడ్నాప్ బ్యాక్ డ్రాప్ స్టోరీ బలంగా లేదు.  సెకండాఫ్ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ముందు మగాళ్లకు వెంకటేష్ ఇచ్చిన మెసేజ్ రొటీన్ గానే ఉంది. నరేష్, వీటీవీ గణేష్ మధ్య కామెడీ కొన్ని చోట్ల నార్మల్ గా ఉంది. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన బుల్లిరాజు పెర్ఫార్మెన్స్ బాగుంది. గోదావరి జిల్లాలలో జనరల్ గా అక్కడక్కడా కనిపించే పిల్లల్లి తలపించాడు. ఈ పాత్ర మూవీకి ప్లస్ అయ్యింది. హిలేరియస్ ట్రాక్ అది. పెళ్లికి ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించా అంటూ తిరిగి, బ్రేక్ అప్ తరవాత నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తానని ప్రగల్భాలు పలికి, తరవాత హాయిగా పెళ్ళిచేసుకుని, నలుగురి పిల్లలని కనీ ఎదురుపడిన ప్రియుడిని చూసిన మీనాక్షి పరిస్థితి, పెళ్ళికి ముందు ఒక ఎఫైర్ నడిపిన భర్త గూర్చి తెలిసి భాగ్యం రియాక్షన్స్ అన్నీ కామెడీ పంచాయి. ఫస్టాఫ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లో తడబడ్డాడు.

ట్రైలర్ లో ఉన్న కథే సినిమా మొత్తం, కథ ముందే రిలీజ్ చేసినా కామెడీతో ఎంటర్ టైన్ చేసారు. ఫస్ట్ పార్ట్ లో విఐపి కిడ్నాప్, అతనిని రక్షించడం కోసం అండర్ కవర్ ఆపరేషన్, విడిపించడానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ కోసం వెతుకులాట, చివరికి మాజీ పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ కథలోకి రావటంతో కథ మలుపు తిరుగుతుంది. మీనాక్షి వెంకటేష్ ని ఒప్పించి ఆపరేషన్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగ్యం కూడా వారితో బయలు దేరటం, ఇలా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ తో కిడ్నాప్ కేసు సాల్వ్ చేసే క్రమంలో రిస్కులు ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తాయి. సెకండ్ హాఫ్ యాక్షన్ మీద దృష్టి పెట్టి కెమెడీని మిస్ చేసాడు. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తో ముగించేశాడు.సెకండ్ పార్ట్ కి ఒక లీడ్ ఇచ్చాడు.  ఫ్యామిలీ ఫ్యాక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.

నటీ నటులు:

వెంకటేష్ కు ఇలాంటి ఫన్నీ అండ్ ఫ్యామిలీ క్యారక్టర్స్ కొట్టిన పిండి. ఇలాంటి పాత్రల్లో వెంకీ పరకాయ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు మరొకసారి యాదగిరి పాత్రలో వెంకటేష్ అదరగొట్టారు. F2 , F3 కాంబో మూవీస్ ని మరొకసారి గుర్తు చేసారు. ఘర్షణ సినిమాలలో పోలీసుగా ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడింకో సారి మాజీ పోలీసు అధికారిగా నవ్వులు పూయించారు.  భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఒదిగిపోయింది. అసలు సిసలైన భార్యలా ఉంది ఐశ్వర్య నటన, మీనాక్షి చౌదరి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. వెంకీ, మీనాక్షి మధ్య ఏజ్ గ్యాప్ కి మంచి జస్టీస్ఫికేషన్ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టారు. నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి కుమార్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ :

దర్శకుడిగా అనిల్ రావి పూడి మరొకసారి విజయం సాధించారు. తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించి సంక్రాంతికి సంబరాలు తెచ్చారు. ఈ మూవీ ఆడియన్స్ లోకి వెళ్లటానికి బజ్ ఏర్పడటానికి కారణం సంగీతం. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాకపోతే స్క్రీన్ మీద ఆశించిన స్థాయిలో పిక్చరైజేషన్ లేకపోవటం నిరుత్సాహ పరుస్తుంది. వెంకటేష్ పాడిన సాంగ్ ప్లేస్మెంట్ కరక్ట్ గా లేదు. మాటలు ఈజీగా ఆడియన్స్ కి గుర్తు ఉండేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మంచి ఫీల్ ఇచ్చింది. లొకేషన్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ 

వెంకటేష్ 
నటీ నటులు 
కామెడీ 
సంగీతం

మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్ 
లాజిక్స్ మిస్ 
ట్విస్ట్స్ లేకపోవటం

ఫైనల్ వర్దిక్ట్ : ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'

ALSO READ: Sankranthiki Vastunnam Movie Review and Rating