ENGLISH

కోలీవుడ్ లో అడుగుపెట్టిన బేబీ హీరోయిన్

15 January 2025-15:31 PM

బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. చిన్న సినిమాగా వచ్చిన బేబీ భారీ హిట్ సాధించింది. అవార్డ్స్, రివార్డ్స్ కూడా అందుకుంది బేబీ మూవీ. ఈ సినిమా తరువాత వైష్ణవీ చైతన్య ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. కానీ బేబీ తరవాత ఒకే ఒక్క సినిమాతో వచ్చి డిజాస్టర్ చూసింది. మళ్ళీ ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది వైష్ణవి. ప్రస్తుతం తెలుగులో ఆనంద్ దేవరకొండతో ఒక మూవీ, సిద్దు జొన్నలగడ్డ తో 'జాక్' మూవీ చేస్తోంది. ఇవి కాక తమిళం, మలయాళం, కన్నడ నుంచి కూడా అవకాశాలు వస్తున్నట్టు సమాచారం.

తెలుగు అమ్మాయిలకి టాలీవుడ్ లో ఛాన్స్ లు రాకపోయినా మిగతా భాషల్లో సత్తా చాటి పేరు తెచ్చుకున్నవారు కొందరు ఉన్నారు. ఇపుడు ఈ లిస్ట్ లో వైష్ణవీ కూడా చేరుతోంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు సౌత్ లో బిజీగా హీరోయిన్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బేబీ మూవి కంటే ముందు 'అలవైకుంట పురం' సినిమాలో నటించింది. తమిళంలో అజిత్ సినిమాలో నటించింది. కానీ బేబీ సినిమా గుర్తింపుతో పాటు ఫిలిం ఫేర్ కూడా అందించింది. ఇప్పుడు కోలీవుడ్ లో హీరోయిన్ గా రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.

కన్నడలో కూడా ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించటం వలనే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదని పేర్కొంది వైష్ణవి. ప్రజంట్ తెలుగులో మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. వైష్ణవీ కోలీవుడ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎవరితో అన్నది ఇంకా తెలియలేదు. కానీ ఈ మూవీస్ హిట్ అయితే బేబీ కోలీవుడ్ లో బిజీ అవటం ఖాయం.