ENGLISH

జూదం మత్తులో మ‌హేష్ హీరోయిన్‌.

02 June 2020-16:00 PM

ఇది వ‌ర‌కు ద‌ర్శ‌కులంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌పై ఫోక‌స్ పెట్టేవారు. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా హీరోయిన్ పాత్ర చిత్ర‌ణ‌పైనా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెడుతున్నారు. హీరోయిన్ పాత్ర కూడా వెరైటీగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మ‌హేష్ బాబు కొత్త సినిమా `స‌ర్కారు వారి పాట‌`లోనూ క‌థానాయిక పాత్ర స‌మ్‌థింగ్ స్పెష‌ల్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సినిమా ఇది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుంది. క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే.. ఈలోగా హీరోయిన్ పాత్ర గురించిన ఓ కీల‌క‌మైన అంశం బ‌య‌ట‌కు లీకైపోయింది.

 

ఈ సినిమాలో హీరోయిన్ ఓ కోటీశ్వ‌రుడి కూతురు. తండ్రిలానే తానూ జూదం మత్తులో మునిగిపోతుంద‌ట‌. అలా ఓ కాసినోలో హీరో కంట ప‌డుతుంద‌ట‌. అక్క‌డి నుంచీ హీరో - హీరోయిన్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం మొద‌ల‌వుతుంది. క‌థానుసారం కాసినో నేప‌థ్యంలో కొన్ని సీన్లు తీయాల్సివ‌స్తోంది. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కాసినో సెట్ వేయ‌డానికి రెడీ అయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కరోనా భ‌యాల నేప‌థ్యంలో షూటింగుల‌న్నీ హైద‌రాబాద్‌లోనే చేయాల్సివ‌స్తోంది. లేదంటే ఆయా స‌న్నివేశాల కోసం ఏ విదేశాల‌కో వెళ్లేవారు.

ALSO READ: ఎన్టీఆర్ రెడీ... ఇక క్లాప్ కొట్ట‌డ‌మే ఆల‌స్యం