ENGLISH

డాన్స్‌ అదరగొట్టేస్తోన్న 'అఖిల్‌' బ్యూటీ

10 June 2017-12:10 PM

'అఖిల్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. తొలి సినిమాకే హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుని తెలుగులో సెటిలై పోవాలని అనుకుంది. కానీ అనూహ్యంగా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన 'అఖిల్‌' సినిమా నిరాశ పరచడంతో అమ్మడి ఆశకి బ్రేకులు పడిపోయాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లో సాయేషా సైగల్‌ 'శివాయ్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా కూడా సాయేషాకి ఆశించినంత విజయాన్ని అందించలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా తమిళంలో 'వనమగన్‌' సినిమాలో సాయేషా నటిస్తోంది. జయం రవి హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. లేటెస్టుగా ఈ సినిమా నుండి ఓ సాంగ్‌ వీడియో బయటికి వచ్చింది. ఆ సాంగ్‌లో సాయేషా డాన్సులకి అంతా ఫిదా అయిపోతున్నారు. తెలుగులో చేసిన 'అఖిల్‌' సినిమాలో కూడా అమ్మడు డాన్సులు ఇరగదీసేసింది. అయితే అఖిల్‌పైనే ఫోకస్‌ మొత్తం పెట్టడంతో సాయేషా కష్టానికి విలువ లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడలా కాదు, 'వనమగన్‌' సినిమాలో సోలో సాంగ్‌తో దుమ్ము రేపేస్తోంది సాయేషా. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ సాంగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. క్యూట్‌గా సాయేషా వేస్తున్న డాన్సులు చూస్తుంటే, డాన్స్‌ అంటే ఇంత అందంగా వేస్తారా? అనుకోక తప్పదు. అంత అందంగా ఉంది బీచ్‌ పక్కన సాయేషా స్టెప్పులేస్తోంటే!

ALSO READ: కోర్టు నోటిసులతో త్రిషకి తలనొప్పులు!