గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 2025 జనవరి 10 న గేమ్ చేంజెర్ మూవీ థియేటర్స్ లో సందడిచేయనుంది. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా లక్నోలో టీజర్ రిలీజ్ చేసారు. ఎన్నాళ్ళో వేచిన హృదయాలకి ఉపశమనం లభించింది ఈ టీజర్ తో. టీజర్ లో చాలా షాట్స్ చూపించి రెండు, మూడు డైలాగ్స్ తోనే ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. అయితే రిలిజ్ అవటమే ఆలస్యం అప్పటినుంచి గేమ్ ఛేంజర్ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. మూడు భాషల్లో టీజర్ రిలీజ్ చేయగా అన్ని భాషల్లో కలిపి గేమ్ ఛేంజర్ టీజర్ 24 గంటల్లో 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయటంతో మెగా ఫాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లు వారిని వెంటాడుతున్న భయం పోయి కేరింతలు కొడుతున్నారు. కారణం చెర్రీ RRR తరవాత చేస్తున్న సినిమా ఇదే కావటం. ఈ మూవీకోసం మూడేళ్లు టైమ్ కేటాయించి లాక్ అయిపోయాడు చెర్రీ. దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి వరుస డిజాస్టర్లు చూస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే భారతీయుడు3 కి మార్కెట్ లేకపోవటంతో డైరక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఇలా అన్నివిషయాల్లోనూ సంశయాలే ఎదురవుతుంటే గేమ్ ఛేంజర్ పై మెగా ఫాన్స్ కి భయం పట్టుకుంది. కానీ టీజర్ రిలీజ్ కి వచ్చిన క్రేజ్ ఆ భయాలను దూరం చేసింది. త్వరలోనే టీజర్ 100 మిలియన్ వ్యూస్ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ తోనే ఇంత బీభత్సాన్ని సృష్టించిన గేమ్ ఛేంజర్, ట్రైలర్, సినిమాతో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చెర్రీ మూడేళ్ళ కష్టానికి ఫలితం దక్కింది.