ENGLISH

విజ‌య్ పెద్ద ప్లానే వేశాడే..?!

01 July 2021-11:00 AM

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ విజ‌య్‌. త‌న సినిమా అంటే.. క‌చ్చితంగా వంద కోట్ల క్ల‌బ్ లో చేరిపోతుంది. వ‌సూళ్ల‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవ‌ల విజ‌య్ టాలీవుడ్ పైనా దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి విజ‌య్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాత‌. విజ‌య్ చేతిలో ప్ర‌స్తుతం బీస్ట్ అనే సినిమా ఉంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

బీస్ట్ లో బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నార్ట‌. ఇందుకు సంబంధించి షారుఖ్ తో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని, షారుక్ కూడా అందుకు ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది. అస‌లే విజ‌య్ సినిమా.. అందులోనూ షారుక్ అంటే... ఇక ఆ సినిమా ఏ రేంజులో ఉంటుందో చెప్పా్సిన ప‌నిలేదు. విజ‌య్ పాన్ ఇండియా ప్ర‌యాణం ఈ సినిమాతో మొద‌లైనా ఆశ్చ‌ర్యం లేదు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

ALSO READ: ఆస్తుల్న‌నీ అమ్మి.. అప్పుల పాలైనా.. ఇద్ద‌రూ ద‌క్క‌లేదు