గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజెర్'. ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోలు బాలయ్య, వెంకీ లతో పోటీకి దిగాడు చరణ్. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కి మంచి ఆదరణ లభించింది. శంకర్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. శంకర్ ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తుంది. శంకర్ కేవలం ఒక్క పాటకోసం కోట్లు ఖర్చుపెట్టి సెట్స్ వేసిన సందర్భాలు, పాటలో ఒక్కో సీన్ ఒక్కో దేశం లో చిత్రించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెక్నీషన్స్, విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల కూడా చాలా శ్రద్ద పెడతారు శంకర్. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన బెడితే గేమ్ చేంజర్ పాటల కోసం శంకర్ ఎంత ఖర్చు పెట్టారో అన్న విషయం ఇప్పడు నెట్టింట చర్చకి దారి తీసింది. 'గేమ్ ఛేంజర్' లో పాటల సెట్ వర్క్ చూసి ఈ చర్చ జరుగుతోంది. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలున్నాయి. వీటి కోసం శంకర్ 92 కోట్లు బడ్జెట్ వెచ్చించారని సమాచారం. జనరల్ గా శంకర్ 100 కోట్లు పాటలకి కేటాయిస్తారని, కానీ ఈ సినిమాకి ఇంకా 8 కోట్లు మిగిల్చారని గొప్పగా చెప్పుకుంటున్నారు యూనిట్.
గేమ్ చేంజెర్ లో పాటలన్నిటిలో కాస్ట్లీ పాట 'నా నా హైరానా' అని తెలుస్తోంది. కారణం దీనికోసం 18 కోట్లు ఖర్చు పెట్టారని, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో ఈ సాంగ్ చిత్రించారని సమాచారం. న్యూజిలాండ్‌లో చిత్రించిన ఈ సాంగ్ కి కెమెరా ఖర్చు ఎక్కువ ఆయినట్లు టాక్. పాటల్లో కూడా ఆ రిచ్ నెస్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఏపాటకు ఆ పాట ప్రత్యేకతను సంతరించుకుంది.