ENGLISH

శర్వా గ్యారంటీగా కొట్టేస్తానంటున్నాడు

28 September 2017-12:12 PM

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహానుభావుడు'. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. దసరా బుల్లోడు అనిపించుకునేందు శర్వా చేస్తోన్న ప్రయత్నం ఈ 'మహానుభావుడు'. ఎందుకంటే వరుసగా రెండేళ్లు సంక్రాంతి సీజన్‌లో స్టార్‌ హీరోలతో పోటీగా వచ్చి రెండు సినిమాలతోనూ సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. అంతేకాదు చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లను తెచ్చి పెట్టాడు యంగ్‌ హీరో శర్వా. ఇప్పుడు దసరా పండక్కి కూడా సిద్ధమైపోయాడు. ఏ తరహా క్యారెక్టర్‌నైనా పండించగల సత్తా ఉన్నోడు శర్వానంద్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే విభిన్న తరహా క్యారెక్టర్స్‌తో అలరించాడు. అయితే కామెడీ శర్వానంద్‌కి బాగా కలిసొచ్చిన అంశం. కామెడీ హీరోగా మారాక వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు. తిరుగే లేదు శర్వానంద్‌కి. ఈ సారి కూడా అదే కాన్సెప్ట్‌తో వస్తున్నాడు మనోడు. కామెడీ సినిమాలకి పెట్టింది పేరు డైరెక్టర్‌ మారుతి. అలాంటి మారుతి శర్వానంద్‌తో 'మహానుభావుడు' వంటి సినిమా తీసి హిట్‌ కొట్టేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాకి వస్తున్న పోజిటివ్‌ వైబ్స్‌ చూస్తుంటే ఈ సారి కూడా శర్వాకి హిట్‌ ఖాయమనిపిస్తోంది. ముద్దుగుమ్మ మెహరీన్‌ లక్కీ లెగ్‌ ఈ సినిమాకి కలిసొచ్చే అంశం కానుంది. 'అతిశుభ్రం' అనే కాన్సెప్ట్‌తో శర్వా పండించే నవ్వులు మామూలుగా ఉండవనీ, టీజర్స్‌, ట్రైలర్స్‌ చెప్పకనే చెప్పేశాయి. ట్రైలర్‌తోనే ఇంత నవ్విస్తే ఇక సినిమాతో ఇంకెంత నవ్వించనున్నాడో కదా శర్వానంద్‌. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. ఇప్పటికే స్టాెర్‌ హీరోలు 'జై లవకుశ', 'స్పైడర్‌' సినిమాలతో వసూళ్లు దుమ్ము దులిపేస్తున్నారు. మరి లేటెస్టుగా యంగ్‌ స్టార్‌ శర్వానంద్‌ ఎంత మేర వసూలు చేస్తాడో చూడాలిక.

ALSO READ: కొడుకు కోసం ‘మెహబూబా’ అంటున్న పూరి