పాపం.. శర్వానంద్ కి ఈ మధ్య హిట్టే పడలేదు. వరుసగా అన్నీ ఫ్లాపులే. చివరిగా.. `మహా సముద్రం` కూడా ముంచేసింది. ఈ ఫ్లాపుల ప్రభావం శర్వా కెరీర్‌పై గట్టిగానే పడుతోంది. ఇక మీదైనా.. తాను కోలుకోవాలంటే ఓ హిట్టు పడాల్సిందే. శర్వా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఆడాళ్లూ మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం.. రెండూ సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఒకే ఒక జీవితం సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకుందని సమాచారం. దాదాపు 25 కోట్లకు ఈ సినిమాని అమేజాన్ కొనేసిందని టాక్. 25 కోట్లంటే మంచి ఆఫరే. ఈ సినిమాకి దాదాపు 15 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. అంటే ఏకంగా పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కిందన్నమాట. శర్వా సినిమాలు ఈమధ్య నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేయడం, టేబుల్ ప్రాఫిట్ రూపంలో రూ.10 కోట్లు ముందే రావడం నిజంగా... గొప్ప విషయమే. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయమై.. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.
ALSO READ: RRR కోసం సల్మాన్‌ని రంగంలోకి దింపుతున్న రాజమౌళి