ENGLISH

గ్లామ్‌ షాట్‌: ఉల్లిపొర అందాల వల

07 June 2017-17:30 PM

ఫ్యాషన్‌కి ఏది అడ్డు. ఏదైనా చెల్లిపోద్ది. ఉల్లిపొర అయినా, కాటన్‌ వల అయినా.. అందుకే బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ సరికొత్తగా డిజైన్‌ చేయించుకున్న ఈ కాస్ట్యూమ్‌ సోషల్‌ మీడియాలో ఇలా ట్రెండింగ్‌ అవుతోంది. చూశారుగా ఈ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ కాస్ట్యూమ్‌. అదిరింది కదా. పైనేమో ఉల్లిపొరలాంటి క్లాత్‌. కిందేమో ఆకట్టుకునే నెట్‌లో అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి. బాలీవుడ్‌లో సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ, ముద్దుగుమ్మలు అప్పుడప్పుడూ ఇలా కొత్త కొత్త ఫ్యాషన్స్‌తో అలరిస్తూ ఉండడం కొత్తేమీ కాదు. ఫ్యాషన్‌తో ఆకట్టుకోకపోతే ట్రెండింగ్‌లో ఉండరు కదా. ఏదేమైనా ఈ కొత్త కాస్ట్యూమ్‌లో ఉన్న శ్రద్దా కపూర్‌ అందంపై కుర్రకారు కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందే! 

 

ALSO READ: Qlik Here For shraddha kapoor Latest Photos