ENGLISH

శ్రద్ధా C/o భాగ్యనగరం

13 September 2017-14:42 PM

ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్న సంగతి అందరికి విదితమే.

అయితే ప్రస్తుతం, శ్రద్ధా గత వారం నుండి భాగ్యనగరంలోనే తిష్ట వేసి తన రాబోయే చిత్రాలకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్నది. నిన్నటి రోజున ప్రభాస్ తో కలిసి తాను నటిస్తున్న సాహూ చిత్ర షూటింగ్ మొదలుపెట్టింది.

ఇక సాహూ చిత్రం కోసం తెలుగు బాషలో ప్రావీణ్యం సంపాదించే ఉద్దేశ్యంతో ఒక తెలుగు టీచర్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నది. అలాగే బాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ జీవితంపై తెరకెక్కనున్న సినిమాకి సంబందించిన బాడ్మింటన్ కోచింగ్ ని గోపీచంద్ అకాడమీ నందు సైనా నెహ్వాల్ పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతున్నది.

దీనితో శ్రద్ధా కపూర్ అడ్రస్ ఇంకొన్ని రోజులు పాటు C/o భాగ్యనగరం.

 

ALSO READ: తెలుగు భాషపై ఇష్టం పెంచుకుంటున్న భామలు