ENGLISH

గ్లామ్‌ షాట్‌: వెరీ స్పెషల్‌ శ్రియా శరన్‌

01 February 2017-12:55 PM

కెరీర్‌ అయిపోయిందనుకుంతలోపే సక్సెస్‌తో దూసుకురావడం శ్రియా శరన్‌కి అలవాటు. 'ఇష్టం' సినిమా నుంచి 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా దాకా ఆమె కెరీర్‌ ఎంతో ప్రత్యేకమైనది. స్టార్‌ హీరోతో రెండో ఇన్నింగ్స్‌లో సూపర్‌ హిట్స్‌ అందుకుంటోంది ఈ బ్యూటీ. చిరంజీవితో కూడా నటించేస్తే తెలుగులో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఫ్రెష్‌గా సక్సెస్‌ కొట్టిన హీరోయిన్‌ అనిపించుకుంటుంది. ఈ బ్యూటీ ఫ్యాషన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌. ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. అదే ఆమె ప్రత్యేకత. ఎంత ట్రెండీగా ఉన్న సంప్రదాయ దుస్తులకీ వన్నె తీసుకురావడం శ్రియలోని మరో ప్రత్యేకత. ఈ ఫొటో చూశాక ఎవరైనా ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే.

ALSO READ: Qlik Here For Shriya Saran Latest Photos