ENGLISH

క‌మ‌ల్ హాస‌న్ బాధ్య‌త నెత్తిమీద వేసుకుంది

24 November 2021-11:14 AM

క‌మ‌ల్ హాస‌న్ కి త‌గిన వార‌సురాలిగా శ్రుతిహాస‌న్ మ‌న్న‌న‌లు అందుకుంటోంది. తెలుగు, త‌మిళం, హిందీ అంటూ మూడు చోట్లా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే స్టార్ హోదాలోని మ‌జాని ఆస్వాదిస్తోంది. అంత‌లోనే... మ‌రో బాధ్య‌తని భుజాన వేసుకుంది. క‌మ‌ల్ హాస‌న్ స్థానాన్ని తాను భ‌ర్తీ చేయాల‌నుకుంటోంది.

 

వివ‌రాల్లోకి వెళ్తే... క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ గా త‌మిళ బిగ్ బాస్ 5 షో ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల క‌మ‌ల్ హాస‌న్‌కి క‌రోనా సోకింది. దాంతో.. ఆయన ఐసొలేష‌న్‌లో ఉన్నారు. కాబ‌ట్టి.., మ‌రో రెండు వారాల పాటు.. ఈ షో నిర్వ‌హించ‌డం సాధ్యం కాదు. అందుకే క‌మ‌ల్ ప్లేస్‌లో శ్రుతిని రంగంలోకి దింపుతున్నార్ట‌. క‌మ‌ల్ మ‌ళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చేంత వ‌ర‌కూ శ్రుతి ఈ షోని న‌డిపిస్తుంద‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే నిజ‌మైతే.. శ్రుతికి నిజంగా ఇది కొత్త అనుభ‌వ‌మే. టాక్ షోలు న‌డ‌ప‌డం వ‌ర‌కూ ఓకే గానీ, ఇలాంటి రియాలిటీ షోల బాధ్య‌త‌ని భుజాన వేసుకోవ‌డం మాట‌లు కాదు. దానికి చాలా అనుభ‌వం కావాలి. మ‌రి.. శ్రుతి ఏం చేస్తుందో చూడాలి.

ALSO READ: రూమ‌ర్లు ఆపాలంటున్న కైకాల కుటుంబ స‌భ్యులు