ENGLISH

శృతిహాసన్ ఎందుకిలా చేస్తోంది?

26 October 2024-12:06 PM

పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన స్టార్ డాటర్  శృతి హాసన్ మొదట్లో ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుంది. దాని నుంచి బయటపడటానికి చాలాకాలం పట్టింది. తన హార్డ్ వర్క్, డెడికేషన్ తో క్రమ క్రమంగా లక్కీస్ట్ హీరోయిన్ గా మారింది. చాలా  మందికి శృతి లక్కీ హీరోయిన్ అయ్యింది. ముఖ్యంగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది శృతి. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్', చెర్రీతో ఎవడు, బన్నీతో రేసుగుర్రం, చిరుతో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్స్ చేసింది. అలాగే వరుస డిజాస్టర్ లతో ఉన్న రవి తేజకి క్రాక్ బిగ్గెస్ట్ హిట్. క్రాక్ లో శృతి హాసన్ హీరోయిన్. ప్రభాస్ తో నటించిన 'సలార్' తో పాన్ ఇండియా హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తున్న శృతి ఈ మధ్య ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుని అందరికి షాక్ ఇస్తోంది.

'సలార్' తరువాత శృతి నుంచి ఇంకో సినిమా రాలేదు. ప్రజంట్ శృతి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ,లోకేష్ కనగరాజ్ కాంబో మూవీ 'కూలీ'. పాన్ ఇండియా మూవీ 'సలార్ 2'. అడవి శేష్ తో 'డకాయిట్', ఇండో-ఆంగ్లో బేస్డ్ ప్రొడక్షన్ లో 'చెన్నై స్టోరీ'. ఈ నాలుగిటిలో ప్రస్తుతం కూలి మూవీ షూటింగ్ జరుగు తోంది. సలార్ 2 ఇంకా టైమ్ పడుతుంది. ఇక అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'డెకాయిట్'  షూటింగ్ స్టార్ట్ చేసారు, టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇలాంటి పీక్ టైంలో శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కారణం డేట్స్ అడ్జస్ట్ కాక అని ప్రచారం జరుగుతోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇంకో సినిమా నుంచి కూడా శృతి హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే చెన్నై స్టోరీ. ఈ సినిమాలో మొదట సమంత నటించాల్సి ఉండగా, మయోసైటిస్ కారణంగా సామ్ తప్పుకుంది. ఈ ప్రాజెక్ట్ ని శృతి ఓకే చేసింది. ఇప్పుడు ఈ మూవీ కూడా శృతి వదులుకున్నట్లు సమాచారం. కారణం స్పష్టంగా తెలియటం లేదు. మళ్ళీ చిత్ర బృందం హీరోయిన్ వేటలో పడింది. దీనితో శృతి వ్యహారం పై మేకర్స్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.