ENGLISH

నాని సరసన శృతిహాసన్‌.?

20 June 2018-12:56 PM

నాని తాజాగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'జెర్సీ' అనే టైటిల్‌తో లేటెస్టుగా ఈ సినిమాని అనౌన్స్‌ చేశాడు నాని.

 

ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏంటంటే, ఈ సినిమాలో నాని సరసన శృతిహాసన్‌ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శృతిహాసన్‌ ఈ సినిమాకి హీరోయినా? లేక గెస్ట్‌ రోలేమైనానా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సినిమాలో శృతిహాసన్‌ పేరునే ఎక్కువగా కన్సిడర్‌ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌ లోగోతోనే అది కన్‌ఫామ్‌ చేశారు. టైటిల్‌ లోగోలో చూపించిన క్రికెట్‌ కిట్‌, టీషర్ట్‌పై అర్జున్‌ పేరు చూస్తుంటే, ఈ సినిమాలో నాని పేరు అర్జున్‌ అనీ, నాని ఓ క్రికెటర్‌గా కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, శృతిహాసన్‌, నాని పెయిర్‌ అంటే కొంచెం కొత్తగానే ఉండబోతుందని భావించాలి. తొలిసారిగా ఈ జంట ఆన్‌స్క్రీన్‌ సందడి చేయబోతోంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన శృతిహాసన్‌కి ఇప్పుడు పెద్దగా సీను లేదు. మొన్నీ మధ్యనే రవితేజ సినిమాలో శృతిహాసన్‌ నటిస్తోందంటూ న్యూస్‌ బయటికి వచ్చింది. కానీ అది కూడా అఫీషియల్‌గా కన్‌ఫామ్‌ కాలేదు. 

ఈ మధ్య శృతిహాసన్‌ చాలా ఛాన్సులు మిస్‌ చేసుకుంది. తమిళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సంఘమిత్ర'ను వదిలేసుకున్న తర్వాత చాలా ఛాన్సులు వచ్చినట్లే వచ్చి మిస్‌ అవుతున్నాయి శృతిహాసన్‌కి. చూడాలిక నానితో శృతి ఛాన్స్‌ నిజమేనా? తెలియాల్సి ఉంది.

ALSO READ: సంజన ఎలిమినేషన్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?