ENGLISH

సంక్రాంతి బరిలో 'వైఎస్సార్‌' బయోపిక్‌.!

20 June 2018-12:51 PM

బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తోన్న ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల బయోపిక్స్‌ తెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఆశక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మహానటి సావిత్రి బయోపిక్‌ని తెరకెక్కించి విమర్శలు అందుకున్నాడు. ఈ ఇన్సిప్రేషన్‌తో మిగిలిన బయోపిక్స్‌ కూడా జోరందుకున్నాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌, స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్స్‌ ప్రస్తుతం మన ముందున్న బయోపిక్స్‌. కాగా వీటిలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. బాలయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగత వైఎస్సార్‌ బయోపిక్‌ ఆన్‌ ది వేలోనే ఉంది. 

జూన్‌ 20 నుండి వైఎస్సార్‌ బయోపిక్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారట. ఈ బయోపిక్‌కి 'యాత్ర' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో ముమ్ముట్టి అచ్చంగా ఒదిగిపోయారు. జూన్‌ 20 నుండి సెప్టెంబర్‌ వరకూ కంటిన్యూస్‌గా చిత్రాన్ని షూట్‌ చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. 'ఆనందోబ్రహ్మ' వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కించి హిట్‌ కొట్టిన మహి.వి.రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

వైఎస్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని, ముఖ్యంగా ఆయన జీవితంలో అతిముఖ్య ఘట్టం పాదయాత్రను, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలతో పాటు, ఆయన మరణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. నిర్విరామంగా షూటింగ్‌ పూర్తి చేసి, సినిమాని సంక్రాంతికి విడుదల చేసే యోచనలో చిత్రయూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: సంజన ఎలిమినేషన్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?