ENGLISH

నా లెక్కలు నాకున్నాయ్‌: శృతిహాసన్‌

17 October 2020-10:02 AM

హీరోయిన్‌ శృతిహాసన్‌ త్వరలో విడుదల కానున్న ‘క్రాక్‌’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే, ఇది ఆమెకు రీ-ఎంట్రీ లాంటి సినిమా. ప్రేమలో పడ్డాక, సినిమా పరిశ్రమకు దూరమైన శృతిహాసన్‌, ఆ ప్రేమకి గుడ్‌ బై చెప్పేసి.. తిరిగి సినిమాల్లో బిజీ అవుతోంది. ‘కరోనా’ వల్ల కాస్త స్లో అయ్యిందిగానీ, లేకోతే రీ-ఎంట్రీలో శృతిహాసన్‌ కెరీర్‌ మాంఛి జోరుతో వుండేదేమో.! ఇక, తన తదుపరి సినిమాల గురించి శృతిహాసన్‌ మాట్లాడుతూ, ‘చేతిలో చాలా ఆఫర్స్‌ వున్నాయి..

 

కొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో వుంటే, ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి..’ అని చెప్పింది. ‘క్రాక్‌’ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాననీ, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నాననీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది శృతి హాసన్‌. రీ-ఎంట్రీలో కెరీర్‌ మీద బెంగ ఏమీ లేదా.? అని ప్రశ్నిస్తే, ‘నా లెక్కలు నాకున్నాయ్‌.. సినీ పరిశ్రమ తలుపులు ఎప్పుడూ నా కోసం తెరచి వుంటాయి.. నా నమ్మకం నాది. అందుకేనేమో, నేను నమ్మినట్లే అవకాశాలు బాగానే వస్తున్నాయ్‌..’ అని చెప్పిన శృతి, తమిళంతోపాటుగా హిందీలో కూడా సినిమాలు చేయబోతున్నానని అంటోంది. శృతికి బాలీవుడ్‌ కూడా కొత్తేమీ కాదు. అయితే, ‘ఎప్పుడూ కొత్త హీరోయిన్‌ అనే ఆలోచనతోనే కష్టపడతాను.. అదే నా సక్సెస్‌ సీక్రెట్‌’ అంటోంది శృతి హాసన్‌.

ALSO READ: త్రిష - శింబు పెళ్లి.. త‌మిళ నాట ర‌చ్చ‌ర‌చ్చ‌!