ENGLISH

కొడతానంటున్నాడు.. కొట్టేస్తాడా?

03 October 2017-18:15 PM

హీరో సిద్దార్డ్‌ ఈ మధ్య చాలా బ్రేక్‌ తీసుకున్నాడు. తాజాగా మన ముందుకొస్తూ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తానంటున్నాడు. వరుస వైఫల్యాలతో సిద్దార్ద్‌ కెరీర్‌ స్లో అయిపోయింది. తాజాగా ఓ హారర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సిద్దార్ద్‌. 'గృహం' టైటిల్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇదో త్రిభాషా చిత్రం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. హిందీలో 'ది హౌస్‌ నెక్స్ట్‌ డోర్‌' పేరుతో విడుదలవుతోంది. ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్దార్డ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలయ్యింది. చిమ్మ చీకట్లో ఓ ఇల్లు, సీరియస్‌ ముఖాలతో సిద్దార్డ్‌, ఆండ్రియా వారిద్దరి మధ్య మెరుపులో మరో యువతి డిఫరెంట్‌ గెటప్‌ ఇదీ.. ఈ ఫస్ట్‌లుక్‌. లుక్‌ చూస్తే ఇది హారర్‌ మూవీ అని తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఫస్ట్‌లుక్‌. ఈ రోజే టీజర్‌ విడుదల కానుంది. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. ఈ రోజు అనగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ప్రో కబడ్డీ మ్యాచ్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు హీరో సిద్దార్డ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మిళింద్‌రావ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదో స్పెషల్‌ మూవీ. ఖచ్చితంగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. క్యూట్‌గా నవ్విస్తూ, అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టిన హీరో సిద్దార్ధ్‌. 'గృహం' సినిమాతో తన ఫ్యాన్స్‌ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక. నవంబరులో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ALSO READ: సక్సెస్ మీట్ కి ‘NO’ చెప్పిన మహేష్?!