ENGLISH

రాములో' పాటపై సిరాశ్రీ చమత్కారం చూడరో.!

27 January 2020-10:05 AM

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో పాటలకు ప్రత్యేకమైన స్థానం వుంటుంది. సాహిత్యపు విలువల దగ్గర్నుంచి, సంగీతం, పిక్చరైజేషన్‌.. ఇలా అన్నిటికీ ప్రత్యేకత వుండేలా చూసుకుంటారాయన. ఏదో పాట వుండాలి కాబట్టి.. అన్నట్టు కాకుండా, పాటని సినిమాలో అంతర్భాగంగా మలచడం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రత్యేకత. చాలాకాలం తర్వాత 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలో అన్ని పాటలూ సినిమా కథ డిమాండ్‌ మేరకు, సినిమాలో భాగంగా వచ్చాయని సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న విషయం విదితమే.

 

పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ చాలా చాలా బాగున్నాయంటే.. దాని వెనుక 'మా అందరి కష్టం' వుందంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఓ ఇంటర్వ్యూలో పాటల రచయిత కాసర్ల శ్యామ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. సినిమాలోని 'రాములో రాములో' పాటపై మాట్లాడారు. ఈ సందర్భంలోనే ఓ ఆసక్తికరమైన విషయాన్ని కాస్ల శ్యామ్‌ ప్రస్తావించారు.

 

'రాములో రాములా' పాట గురించి మరో ప్రముఖ పాటల రచయిత సిరాశ్రీ తనతో మాట్లాడుతూ, సినిమా టైటిల్‌లోనే 'రాములో..' అన్న ప్రస్తావన వుందని చెప్పారంటూ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి తెలియజేశారు. 'అల వైకుంఠపురములో' ఇంగ్లీషు టైటిల్‌ని చూసుకుంటే చివర్లో 'ఆర్‌.ఎ.ఎమ్‌.యు.ఎన్‌.ఓ..' వస్తుంటుంది. అంటే, దానర్థం 'రాములో..'' అనే కదా! అలా చూస్తే సినిమా టైటిల్‌ కూడా 'రాములో' పాటని డిమాండ్‌ చేసిందన్నమాట.. అన్నది సిరాశ్రీ, కాసర్ల శ్యామ్‌తో చెప్పిన మాట. 'వావ్‌..' అని త్రివిక్రమ్‌, ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 'రాములో రాములా' పాట 'అలవైకుంఠపురములో' ఆల్బమ్‌లో అతి పెద్ద హిట్‌ సాంగ్‌.. ఆ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సరికొత్త మైలు రాళ్ళను అధిగమించుకుంటూ వెళుతోంది.

ALSO READ: ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్సిచ్చాడు.. త‌ప్పు చేస్తున్నాడా??