ENGLISH

బాలయ్య కోసం ఆమెను మళ్ళీ తీసుకొస్తున్నారట

17 September 2020-11:00 AM

నందమూరి బాలకృష్ణతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసేస్తోంది సోనాల్‌ చౌహన్‌. తాజాగా మరోమారు ఈ అందాల భామ బాలయ్య సరసన కనిపించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా కోసం పలువురు అందాల భామల పేర్లను బాలయ్య సరసన హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. అయితే, తాజాగా సోనాల్‌ చౌహన్‌ పేరు ఖాయమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సోనాల్‌, ఇప్పటికే బాలయ్యతో మూడు సినిమాల్లో నటించింది. సో, ఈ గాసిప్‌ నిజమైతే సోనాల్‌ - బాలయ్య కాంబినేషన్‌లో నాలుగో సినిమా అవుతుందిది.

 

తెలుగులో ‘రెయిన్‌బో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాల్‌, బాలయ్య కాకుండా రామ్ పోతినేనితో ‘పండగ చేస్కో’ సినిమాలో నటించింది. ‘సైజ్‌ జీరో’ సినిమాలోనూ కనిపించిందామె. బాలయ్యతో సోనాల్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ ప్రతిసారీ బాగానే వర్కవుట్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెని మరోమారు సెలక్ట్‌ చేశాడట బోయపాటి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్‌’లో బాలయ్య - సోనాల్‌ కలిసి నటించిన విషయం విదితమే. ఇక, బాలయ్యతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి గతంలో మాట్లాడుతూ, బాలయ్య ప్రొఫెషనల్‌గా వుంటారనీ, ఆన్‌ స్క్రీన్‌ ఆయన చూపే ఎనర్జీ అత్యద్భుతం అనీ సోనాల్‌ కితాబులిచ్చేసింది.

ALSO READ: విలన్‌ హీరో అయ్యాడు.. హీరోయిన్‌ విలన్‌ అయ్యింది