ENGLISH

ఆ అందమైన పెదాలకు ఏమయ్యింది?

12 June 2017-12:53 PM

హీరో, హీరోయిన్స్‌ అంటేనే అందంగా ఉంటారు. అయితే తమ అందానికి సంబంధించి, ఫీచర్స్‌లో ఏమైనా చిన్నా చితకా లోపాలుంటే, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకోవడం కూడా సహజమే. అలనాటి మేటి నటి శ్రీదేవి కూడా ముక్కుకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారయిన సంగతి తెలిసిందే. తాజాగా అందాల భామ సోనాల్‌ చౌహన్‌ తన పెదాలకు సర్జరీ చేయించుకుని, ఇంకా అందంగా మార్చుకుందని గాసిప్స్‌ వినవస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్‌పై సోషల్‌ మీడియాలో స్పందించింది ఈ ముద్దుగుమ్మ. తాను ఇంతవరకు ఎలాంటి సర్జరీలూ అందం కోసం చేయించుకోలేదని స్పష్టంగా చెప్పింది. తన తల్లి దండ్రుల కారణంగా అందమైన శరీరం ఉందని, దాన్ని రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు చేసి మరింత పెంచుకుంటాను తప్ప సర్జరీలను ఆశ్రయించబోనని వివరించింది. అరె.. ఎందుకిలా ఈ ముద్దుగుమ్మ చిర్రుబుర్రులాడుతోంది. ఇది క్యాజువల్‌ ఇష్యూనే కదా అని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం నో కాంప్రమైజ్‌.. నేను సర్జరీ చేయించుకోలేదని చెబుతూనే, పెదాల ఆకృతి ఒక్కోసారి ఒక్కోలా ఉండటానికి కారణం లిప్‌స్టిక్‌ మాత్రమేనని చెప్పింది. మేకప్‌ ఆర్టిస్ట్‌ ఒక్కోసారి ఒక్కోలా లిప్‌స్టిక్‌ని డిజైన్‌ చేస్తుంటాడని, దాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం తగదనీ చెప్పింది ఈ బ్యూటీ. తెలుగులో 'పండగ చేస్కో' తదితర సినిమాల్లో సోనాల్‌ చౌహన్‌ నటించింది. 

ALSO READ: కొడుతున్నాం, కొట్టేస్తున్నాం: బన్నీ కాన్ఫిడెన్స్‌

ALSO READ: Qlik Here For Sonal Chauhan Latest Photos