ENGLISH

శ్రీ విష్ణులోని మ్యాజిక్‌ అదే!

17 March 2018-08:00 AM

సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో తన యాక్టింగ్‌ టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో పాటు, హీరోగానూ తనది విలక్షణ దారి అని ప్రూవ్‌ చేశాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. 'అప్పట్లో ఒకడుండేవాడు', 'మెంటల్‌ మదిలో' వంటి చిత్రాలతో విభిన్న కథాంశాలున్న చిత్రాలను ఎంచుకుని, తన రూటే సెపరేట్‌ అన్నాడు. ఇప్పుడు 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో వస్తున్నాడు. వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.   

ఇకపోతే ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ఎంత చదివినా చదువు బుర్రకెక్కని యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. హీరో ఫన్నీ చేష్టలతో సరదా, సరదాగా మొదలైన ట్రైలర్‌ చివరికి ఎమోషనల్‌ డైలాగ్స్‌తో ముగిసింది. రెండు వేరియేషన్స్‌లోనూ శ్రీవిష్ణు తనదైన శైలి నటనను కనబరిచినట్లు తెలుస్తోంది. 'బిచ్చగాడు' ఫేం సాట్నా టైటస్‌ ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నటిస్తోంది. తొలిసారి ఈ భామ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలో నటిస్తోంది ఈ సినిమాతోనే. ఇకపోతే ఇటీవల శ్రీవిష్ణు 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో హీరో రామ్‌కి ఫ్రెండ్‌గా నటించాడు. 

అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణు క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ ఉన్నట్లు కనిపించలేదు. దాంతో ఆ పాత్ర అంతగా హైలైట్‌ కాలేదు. కానీ 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో శ్రీవిష్ణు ఏదో మ్యాజిక్‌ చేసేలానే ఉన్నాడు. అయినా యాక్టింగ్‌లో శ్రీవిష్ణు స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. సరిగ్గా వాడుకోవడం తెలియాలి అంతే. ఈ సినిమాకి శ్రీవిష్ణు తనలోని టాలెంట్‌ అంతా బయట పెట్టేసినట్లే కనిపిస్తున్నాడు ట్రైలర్‌ చూస్తుంటే. అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోందీ ట్రైలర్‌. 

చూడాలి మరి లీడ్‌ రోల్స్‌లో శ్రీవిష్ణు నటించిన సినిమాలు తనకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలాగే ఈ సినిమాతోనూ శ్రీవిష్ణు సక్సెస్‌ కొడతాడనే అనిపిస్తోంది. నారా రోహిత్‌ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.

ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్