ENGLISH

ఈ మూతి ముద్దుల గోలేంటి?

17 March 2018-07:00 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ పుట్టినరోజునాడు అందరూ చూస్తుండగానే, తన భార్యకు లిప్‌ టు లిప్‌ కిస్‌ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అంత పబ్లిగ్గా లిప్‌ టు లిప్‌ కిస్‌ ఇస్తాడా అమీర్‌ఖాన్‌ అంటూ ఆ సంఘటన పెద్ద వివాదాస్పదమైంది. తాజాగా హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌కి కూడా హాట్‌ లిప్‌ కిస్‌ గుర్తొచ్చినట్లుంది. 

తన భర్తకు హాట్‌ హాట్‌ లిప్‌ కిస్‌ ఇచ్చి, ఫోటోకి పోజిచ్చి ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఇది కూడా ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతోంది. అయినా సినిమాల్లో లిప్‌ టు లిప్‌ కిస్‌లే ఈ మధ్య వివాదాస్పదమవుతుంటే, ఇప్పుడీ ఒరిజినల్‌ లిప్‌ కిస్‌ల గోలేంటి చెప్మా అంటూ నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. అయినా సెలబ్రిటీస్‌కి కూడా సినిమాల్లో లిప్‌లాక్స్‌ బోర్‌ కొట్టేసి ఉంటాయి. దాంతో తమ ఒరిజినల్‌ లైఫ్‌ ఫాట్నర్స్‌తో ఆ ముచ్చటని తీర్చుకుంటున్నారు. తీర్చుకుంటే తీర్చుకున్నారు. మళ్లీ దానికి ఈ పబ్లిసిటీ పిచ్చేంట్రా బాబూ!

మరీ పబ్లిసిటీ అంటే ఇంత పిచ్చగా తయారైంది. సోషల్‌ మీడియా వచ్చాక ప్రతీదీ పబ్లిసిటీనే. అయితే లిప్‌ లాక్‌ల గోలేంటో కొత్తగా. ఏదైనా కానీ ఒక్కరితో ఆగట్లేదుగా. 'ట్రెండింగ్‌' పేరుతో ఈ పిచ్చ పరాకాష్టగా మారి ఇంకెంత మందికి అంటుతుందో. అలా అలా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఇంకెన్ని పర్‌ఫామెన్సెస్‌ చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు ఒకింత కంగారు పడడంతో పాటు, కాస్త ఆశక్తి కూడా కనబరుస్తున్నారు. చూడాలి మరి నెట్టింట్లో సందడి చేస్తోన్న ఈ లిప్‌ లాక్స్‌ తాజాగా ఇంకే సరికొత్త వివాదాలకు దారి తీస్తాయో.

ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్