ENGLISH

దర్శకుడికి గిఫ్ట్ ఇచ్చిన హీరో

16 March 2018-19:13 PM

ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువ శాతం హీరోకే వెళ్ళిపోతుంది. ఇది నిజం అని చాలా మంది ఒప్పుకుంటారు. అయితే అగ్ర దర్శకులకి మాత్రం దీని నుండి మినహాయింపు దొరుకుతుంది.

ఇక పైన చెప్పిన విధంగా దర్శకులకి కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ప్రముఖ హీరో సూర్య నడుంబిగించినట్టుంది. దీనికి ఉదాహరణగా ఆయన ఈ మధ్యకాలంలో పనిచేసిన దర్శకులకి కారుని బహుమతిగా ఇచ్చే విధానం మొదలుపెట్టాడు.

ఇప్పటికే ఆయన సింగం 3 దర్శకుడైన హరికి అలాగే మేము చిత్రాన్ని తీసిన పాండిరాజ్ కి కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇక తాజాగా ఆయనతో గ్యాంగ్ చిత్రాన్ని తీసిన విగ్నేష్ శివన్ కి కూడా అదే దారిలో ఒక కారుని బహుమతిగా ఇచ్చాడు.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు విగ్నేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక తనని ఇంతలా సత్కరించిన హీరో సూర్యని తాను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను అని తన ఆనందం పంచుకున్నాడు.

 

ALSO READ: ప్రముఖ గాయకుడికి రెండేళ్ళ జైలు