విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 5 న విడుదల కానుంది.
చిత్ర ట్రైలర్ కు అద్భుత స్పందన రాగా, ఎస్ తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోద భరిత చిత్రం కావడంతో విష్ణు - నాగేశ్వర్ రెడ్డిలు హాట్ట్రిక్ హిట్ సాధిస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.
అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5 న భారీగా విడుదలచేయనున్నారు.
ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్