ప్రముఖ పంజాబీ గాయకుడు అలాగే అనేక బాషలలో తనదైన శైలిలో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు దలేర్ మెహంది.
ఇక ఈరోజు ఆయనకి ఒక కేసులో పంజాబ్ లోని పాటియాలా కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే ఆ వెంటనే స్వంత పూచికత్తు పైన రూ 10,000/- ఫైన్ చెల్లించి బెయిల్ పొందాడు. ఆ కేసు పూర్వాపరాలలోకి వెళితే, 2003లో దలేర్ మెహంది ఆయన తమ్ముడు షంషేర్ పైన బక్షిష్ సింగ్ తనని విదేశాలు పంపిస్తాను అని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేసినట్టు పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
అప్పటినుండి కోర్టులో నలుగుతున్న ఈ కేసు ఇప్పట్టికి ఒక కొలిక్కి వచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మెహంది సోదరులని దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే వెంటనే బెయిల్ పొందిన వీరు పై కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
మొత్తానికి దలేర్ మెహంది కి జైలు శిక్ష పడడం అందరిని ఒక్కసారి షాక్ కి గురిచేసింది.
ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్