ENGLISH

పది ప్లస్‌ రెండు: పన్నెండు చేతుల సవ్యసాచి!

16 March 2018-16:39 PM

'లాస్ట్‌ పంచ్‌ నాదైతే వచ్చే కిక్కే వేరప్పా..' అనేది పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పాపులర్‌ డైలాగ్‌. అయితే ఇప్పుడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య 'ఫస్ట్‌పంచ్‌'తో కిక్కిస్తానాన్నడు. ఇచ్చేశాడు. చైతూ ఇచ్చిన 'సవ్యసాచి' ఫస్ట్‌ పంచ్‌ కిక్‌ నిజంగానే అదిరింది. ఇక ఈ ఫస్ట్‌ పంచ్‌ విషయానికి వస్తే, ఇదో ఫస్ట్‌లుక్‌ అన్నమాట. 

ఈ లుక్‌లో బ్లాక్‌ డ్రస్సుతో చైతూ తలపై చిన్న గాయంతో చాలా కోపంగా చూస్తున్నాడు. చైతూ బ్యాక్‌ డ్రాప్‌లో పది చేతులు చాచినట్లుగా ఉన్నాయి. ఒక్కో చేతి మీద ఒక్కో గుర్తు ఉంది. పరుగెడుతున్న ఓ చిన్న పాప, కొన్ని ప్రశ్నార్ధకాలు, లవ్‌ గుర్తులు. మహా, అక్క.. ఇలా సింబల్స్‌ ఉన్నాయి. వీటి అర్ధం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్‌ విషయానికి వస్తే 'సవ్యసాచి' చాలా పవర్‌ఫుల్‌ పేరది. ఇంతవరకూ ఈ సినిమాలో చైతూ ఎడమ చేయి పని చేయని యువకుడి పాత్రలో కనిపిస్తాడట అనే ప్రచారం జరిగింది. 

కానీ రెండు చేతులతో సమర్ధవంతంగా, సమానంగా పని చేయగల సామర్ధ్యం ఉన్న వ్యక్తినే 'సవ్యసాచి' అంటారు. అలా రెండు చేతులను సమర్ధవంతంగా ఉపయోగించిన వాడు మహాభారతంలో అర్జునుడు. అందుకే అర్జునున్ని సవ్యసాచి అంటారు. రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్యను ప్రదర్శించగలడు అర్జునుడు. అలాగే మన సినిమాలో హీరో చైతూ కూడా రెండు చేతులనూ సమర్ధవంతంగా వినియోగిస్తాడట. అలాగే సమస్యలను, ప్రతికూల పరిస్థితులను కూడా చాలా సమర్ధవంతంగా ఎదురొడ్డి పోరాడతాడట. 

అందుకే స్టోరీకి తగ్గట్లుగా సినిమాకి ఈ టైటిల్‌ పెట్టారు. చైతూకి 'ప్రేమమ్‌' వంటి సక్సెస్‌నిచ్చిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్